తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీస్​ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలి: ఆర్​.కృష్ణయ్య - R.Krishnaiah Meet Home Minister

పోలీస్​ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య డిమాండ్​ చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్​ జారీ చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని హోంమంత్రి మహమూద్​ అలీని కోరారు.

R.Krishnaiah Meet Home Minister mahamood ali
పోలీస్​ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలి: ఆర్​.కృష్ణయ్య

By

Published : Sep 28, 2020, 8:48 PM IST

హోం మంత్రి మహమూద్​ అలీని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య కలిశారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న డీఎస్పీ, ఎస్సై, కానిస్టేబుల్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు.

డీఎస్పీ పోస్టులను గత 10 ఏళ్లుగా డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ కోటా కింద భర్తీ చేయడం లేదని.. మొత్తం పోస్టులన్నీ ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తున్నారని కృష్ణయ్య పేర్కొన్నారు. 40 శాతం డైరెక్టు రిక్రూట్​మెంట్ కోటా కింద ఈ 10 ఏళ్ల కాలంలో 210 పోస్టులు భర్తీ చేయవలిసి ఉందని.. కానీ టెంపరరీ ప్రమోషన్ల పేరు మీద మొత్తం పోస్టులన్నీ సీఐలకు డీఎస్పీలుగా పోస్టింగ్స్ ఇస్తున్నారని తెలిపారు. ఈ విధానం వల్ల నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు హోం మంత్రి జోక్యం చేసుకుని డైరెక్ట్​ రిక్రూట్​మెంట్ కోటా కింద వచ్చే డీఎస్పీ పోస్టులను లెక్కించి.. భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ శాఖలో ఇటీవల 131 పోలీస్​స్టేషన్లు, 30 సర్కిల్ కార్యాలయాలు, 25 డీఎస్పీ కార్యాలయాలు కొత్తగా ప్రారంభించారని.. ప్రమోషన్​ల ద్వారా కొత్త పోస్టులు సృష్టించడం ద్వారా దాదాపు 800 ఎస్సై పోస్టులు, 12 వేల కానిస్టేబుల్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కృష్ణయ్య పేర్కొన్నారు. వీటన్నింటిని భర్తీ చేసేలా తగు ఆదేశాలు జారీ చేయాలని హోం మంత్రిని కోరారు.

ఇదీచూడండి: పోలీసుల నిర్లక్ష్యంతోనే హేమంత్​ హత్య: నారాయణ

ABOUT THE AUTHOR

...view details