'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి' - tsrtc strike
'కేసీఆర్ తాతకు నమస్కారాలు... మా మమ్మీ వాళ్లుకు మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదు. మేం దసరా, దీపావళి పండుగలు కూడా జరుపుకోలేదు. నేను కొత్త బట్టలు కొనుక్కోలేదు. పాఠశాల ఫీజు కట్టలేదు. అందుకే పరీక్షలు రాయనివ్వలేదు. స్కూల్ నుంచి వెళ్లగొట్టారు. కేసీఆర్ తాతా దయచేసి ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవండి' అంటూ ఓ చిన్నారి దీనంగా వేడుకుంది. ఇవాళ ఎంజీబీస్ బస్‌స్టాండ్‌లో జరిగిన ఆర్టీసీ మహిళా కార్మికుల దీక్షలో రిషిత తన ఆవేదన వెల్లబుచ్చుకుంది. ఇది ఈ చిన్నారి వేదనే కాదు... ఇంకెందరో ఆవేదన!
కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి