సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో విద్యాహక్కు చట్టం ఫోరం ఆధ్వర్యంలో చైల్డ్ ఫండ్ ఇండియా సంయుక్తంగా విద్యాహక్కు చట్టం అమలు తీరుపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, బీసీ కమిషన్ ఛైర్మన్ రాములు, పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ మౌలిక సదుపాయాల విషయంలో లోపలున్నాయని వక్తలు వెల్లడించారు.
విద్య సేవా గానీ... వ్యాపారం కాకూడదు - Right to Education Meeting held at Secundrabad
పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి పథంలోకి రావాలంటే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

విద్య సేవా గానీ... వ్యాపారం కాకూడదు
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డ పేదలు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. సమాజంలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యాబోధనలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు.
విద్య సేవా గానీ... వ్యాపారం కాకూడదు
ఇదీ చూడండి: రాజ్యాంగస్ఫూర్తికి పునరంకితం అవుదాం: కేసీఆర్