ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నందు కిషోర్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. గోషామహల్ పరిధిలో ఉన్న వలస కార్మికులను గుర్తించి వచ్చే ఆదివారం నుంచి వారికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు.
నిరుపేదలకు ఆదిత్యకృష్ణ ట్రస్టు బియ్యం పంపిణీ - తెలంగాణలో కరోనా కేసులు
కరోనా కష్టకాలంలో పలువురు తమ దాతృత్వాన్ని చాటుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆకలితో అలమటించే వారికి భోజనాలు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు.
నిరుపేదలకు ఆదిత్యకృష్ణ ట్రస్టు బియ్యం పంపిణీ
తెరాస కార్యకర్తలు ఉపాధి కార్మికులను గుర్తించి నేరుగా నిత్యవసర వస్తువులు వారి ఇంటి వద్దకు చేరుస్తారని తెలిపారు. కరోనా పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని, జాగ్రత్తలు పాటించి వైరస్ను తరిమికొట్టాలని కోరారు.
ఇదీ చదవండి :ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా
TAGGED:
నిత్యావసర వస్తువుల పంపిణీ