హైదరాబాద్ మెహదీపట్నం ప్రాంతానికి చెందిన కృష్ణ ఉదయాన్నే పాల పాకెట్లు, పేపర్లు విక్రయించుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. కాలినడకన చాలా ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం వల్ల ఆలస్యమై వినియోగదారులతో చివాట్లు తినేవాడు. గమనించిన అతడి తమ్ముడు కార్తీక్... అన్న కష్టాన్ని తీర్చాలనుకున్నాడు.
ఈటీవీలో ప్రసారమైన కథనాన్ని చూసి... రైస్ ఏటీఎం నిర్వాహకుడు దోసపాటి రాముకి ఫోన్ చేశాడు. తన సోదరుడి కష్టాన్ని కార్తీక్ వివరించాడు. వెంటనే స్పందించిన దోసపాటి రాము... కృష్ణకు సైకిల్ కొనిస్తానని మాటిచ్చాడు. సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనిస్తే చాలని రామును కోరాడు. కానీ కృష్ణ చెప్పిన విషయాలు నచ్చి హుటాహుటినా ఓ సైకిల్ దుకాణానికి వెళ్లి కొత్త సైకిల్ కొనుగోలు చేశాడు.