Rgv Tweet On Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడిపై పొగడ్తల వర్షం కురించారు వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. రేవంత్‌ను రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ అని అభివర్ణిస్తూ.. ఆకాశానికెత్తేశారు. రేవంత్‌రెడ్డి, ఆర్జీవీ కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. రేవంత్‌తో కలిసి ఉన్న ఫొటోను రామ్‌గోపాల్ వర్మ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. అందులో క్యాప్షన్ రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ అని జోడించడం హాట్ టాపిక్‌గా మారింది. వీరి కలయిక ఎందుకనేది తెలియకపోయినా... ప్రస్తుతం వీరు మాత్రం ట్రెండింగ్‌లో ఉన్నారు. రేవంత్‌పై ఆర్జీవీ వర్షం కురిపించడం వల్ల ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఫుల్ ఖుషీలో ఉన్నారు.
Rgv Tweet On Revanth Reddy: 'రేవంత్... రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ' - Rgv News
Rgv Tweet On Revanth Reddy: వారిద్దరూ వేరు. వారి నేపథ్యమూ వేరు. ఎవరి పనుల్లో వారు నిరంతరం బిజిబిజిగా గడుపుతుంటారు. ఒకరేమో ప్రజా వ్యవస్థలో ఉన్న నాయకుడైతే.. మరొకరు సినీ ఇండస్ట్రీలో వివాదస్పద డైరెక్టర్. వీరిద్దరూ కలిస్తే! ఆ ఊహే భలే ఉంది కదూ. ఇంతకీ వారిద్దరు ఎవరనుకుంటున్నారా? ఒకరు రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాగా మరొకరు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆర్జీవీ(రామ్‌గోపాల్ వర్మ).
Rgv, Revanth