తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్ సార్... మేయర్‌ను కుక్కల మధ్యలో పడేయండి: ఆర్జీవీ - ఆర్టీవీ తాజా కామెంట్స్

RGV sensational comments on Mayor Vijayalakshmi రామ్‌ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఆయన వ్యాఖ్యలు ఎప్పుడూ వివాదాస్పదంగా ఉంటాయి. తాజాగా మరో హాట్ టాపిక్‌లోకి ఆర్జీవీ ఎంటర్ అయ్యారు. తెలంగాణలో కుక్కల దాడి ఘటన వ్యవహారంలో సోషల్ మీడియాలో స్పందించిన వర్మ.. నగర మేయర్‌పై సెటైర్స్ వేశారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు చర్ఛనీయంశంగా మారాయి.

RGV entered the dog attack issue and sensational comments on Mayor Vijayalakshmi.
RGV entered the dog attack issue and sensational comments on Mayor Vijayalakshmi.

By

Published : Feb 23, 2023, 7:42 PM IST

RGV sensational comments on Mayor Vijayalakshmi హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడు.. కుక్కల దాడిలో ప్రాణాలు విడవడం అందరినీ కలచివేశాయి. అయితే ప్రభుత్వంపై ప్రజలు ఫైర్ అయ్యారు. ఇక హైకోర్టు కూడా ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. ఈ విషయంపై ప్రభుత్వానికి, జీహెచ్‌ఎంసీకి ధర్మాసనం నోటీసులు కూడా ఇచ్చింది.

ఇక ఈ విషయంపై నగర మేయర్ విజయలక్ష్మి... కుక్కల దాడి జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వెంటనే అత్యవసర మీటింగ్ పెట్టి.. కుక్కల దాడి మళ్లీ జరగకుండా చర్యలు చేపడతామని హామీనిచ్చారు. ఇక మేయర్ వ్యాఖ్యలపై టాలీవుడ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సెటైరికల్ కామెంట్స్ చేశారు. నగరంలోని దాదాపు 5 లక్షల కుక్కలను ఒక ఇంట్లో చేర్చాలని అన్నారు. ఇక కేటీఆర్‌కు ట్వీట్ చేస్తూ... కేటీఆర్ సార్... ఒక దగ్గరకు చేర్చిన కుక్కల మధ్యలోకి మేయర్‌ను పంపండి.. అంటూ ట్విటర్ వేదికగా సెటైర్ వేశారు. మేయర్ విజయలక్ష్మి తన పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదని వర్మ ప్రశ్నించారు.

ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయని మేయర్ చేసిన వ్యాఖ్యలపై వర్మ మండిపడ్డారు. పిల్లల ప్రాణం కంటే కుక్కల ఆకలి గురించి ఆలోచించటం విస్మయకరమన్నారు. కుక్కలన్నింటినీ ఆమె ఇంట్లోకి తీసుకెళ్లి ఆహారం పెట్టొచ్చు కదా అని సలహానిచ్చారు ఆర్జీవీ. కుక్కలన్నీ మేయర్ ఇంట్లో ఉంటేనే చిన్నపిల్లలకు రక్షణ అని ఆర్జీవీ పేర్కొన్నారు. కుక్కల విషయంలో సమీక్ష చేసి ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు.

ఇక మేయర్​పై ఆర్జీవీ ఇంతకు ముందు కూడా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. విజయలక్ష్మీ తన పెంపుడు కుక్కకు చపాతీ తినిపిస్తున్న వీడియోను 2021లో ట్వీట్ చేశారు. ఆ వీడియో ట్వీట్ చేసిన ఆర్జీవీ.. గౌరవనీయులైన మేయర్ తాను ఎడమ చేత్తో తింటూ.. తన కుక్కకు కుడి చేత్తో తినిపిస్తుంది... మేయర్ గారి నిస్వార్థమైన ప్రేమ ఇది... ఈమెను ఇంటర్నేషనల్ మేయర్ ఆఫ్ డాగ్స్‌గా చేయాలి అంటూ.. ఆర్జీవీ అప్పట్లో సెటైర్ వేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details