తెలంగాణ

telangana

ETV Bharat / state

స్టెప్పులేస్తూ... అవగాహన కల్పిస్తూ... విద్యార్థుల ఫ్లాష్​మాబ్ - అంతఃప్రజ్ఞ-2020 ఫెస్టివల్‌

అంతఃప్రజ్ఞ-2020 ఫెస్టివల్‌పై అవగాహన కల్పిస్తూ... బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఫ్లాష్‌మాబ్‌ చేస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నారు. సినిమా గీతాలకు అదిరేటి స్టెప్పులేస్తూ చూపరులను కట్టిపడేశారు.

RGUKT basara students flash mob in Necklace Road
స్టెప్పులేస్తూ... అవగాహన కల్పిస్తూ... విద్యార్థుల ఫ్లాష్​మోబ్

By

Published : Jan 31, 2020, 12:27 PM IST

హైదరాబాద్‌ నక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో ఆర్​జేయూకేటీ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఫ్లాష్‌మాబ్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. అంతఃప్రజ్ఞ-2020 ఫెస్టివల్‌పై అవగాహన కల్పిస్తూ... విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి.

జాతీయ స్థాయిలో జరుగుతున్న అతి పెద్ద రూరల్‌ టెక్నికల్‌ ఫెస్టివల్‌లో భాగంగా రైతులకు సాంకేతికతను పరిచయం చేస్తూ... మరోవైపు త్రినయ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ట్రిపుల్ ఐటీ ఉపకుపలతి అశోక్‌ తెలిపారు. 14 విభాగాల్లో 700లకు పైగా వివిధ అంశాలతో ప్రదర్శన ఉంటుందని తెలిపారు.

స్టెప్పులేస్తూ... అవగాహన కల్పిస్తూ... విద్యార్థుల ఫ్లాష్​మాబ్

ఇవీ చూడండి: విభిన్న రకాల డిజైన్లు... క్యాట్​వాక్​తో ఆకట్టుకున్న విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details