కరోనా వైరస్‌పై పెరుగుతున్న పుకార్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించారు. అనవసరంగా పుకార్లను నమ్మవద్దని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కేసు మాత్రమే నమోదైందని తెలిపారు. ఇప్పటివరకు 45 శాంపిల్స్‌లో కరోనా నెగిటివ్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మరో ఇద్దరి శాంపిల్ రిపోర్టులు రేపు ఉదయం వస్తాయని వివరించారు. కరోనా సోకిన వ్యక్తి కోలుకుంటున్నారని స్పష్టం చేశారు.
ఒక్క కేసు మాత్రమే నమోదు.. మరో ఇద్దరి నివేదిక రావాల్సి ఉంది.. - హైదరాబాద్‌లో కరోనా
సైబరాబాద్ కమిషనరేట్‌లో ఉన్నతాధికారులు కరోనా వైరస్‌పై భేటీ అయ్యారు. కొవిడ్-19తో రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేదని.. అనవసర పుకార్లు నమ్మవద్దని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఒక్క కేసు మాత్రమే నమోదైందని తెలిపారు.
'కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నాం'
ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత వాడటం వల్ల కరోనాను నియంత్రించవచ్చని శ్రీనివాస్ తెలిపారు. వ్యాధి లక్షణాలున్న వారిని పరిశీలనలో ఉంచామని పేర్కొన్నారు. మొత్తం 3వేల మందికి ఐసోలేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇవీ చూడండి:ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం
Last Updated : Mar 4, 2020, 7:35 PM IST