తెలంగాణ

telangana

ETV Bharat / state

Huzurabad by poll: 'హుజూరాబాద్​ ఉపఎన్నిక నిర్వహణకు 20 కేంద్ర బలగాలు'

హుజురాబాద్ ఉపఎన్నిక (Huzurabad by poll)పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌ కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లు, పోలీసుల అధికారులతో శశాంక్ గోయల్‌ దృశ్య మాధ్యమం ద్వారా పోలింగ్, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల నియమావళి, కొవిడ్​ మార్గదర్శకాలు, ప్రచారాలకు సంబంధించిన వాటిపై సమావేశంలో చర్చించారు.

Huzurabad bypoll
హుజూరాబాద్​ ఉప ఎన్నిక

By

Published : Oct 23, 2021, 8:57 PM IST

ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్(Huzurabad by poll) ఉపఎన్నికను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్(chief electoral officer shashank goyal) అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై హైదరాబాద్​లోని బుద్దభవన్ నుంచి శశాంక్ గోయల్ దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రతి ఓటర్​(Huzurabad by poll) కు పోలింగ్ స్టేషన్​లో కల్పించాల్సిన సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, వీల్ ఛైర్లు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వెబ్ కాస్టింగ్, వీడియో చిత్రీకరణ, సీసీ కెమెరాల ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈనెల 27 తర్వాత సైలెంట్ పీరియడ్ ప్రారంభమవుతుందని ఎన్నికల ప్రధాన అధికారి (chief electoral officer shashank goyal) అన్నారు. ఈ నాలుగు రోజుల పాటు ప్రచారం(Huzurabad by poll) కొనసాగుతుందని చెప్పారు. ఈ సమయంలో ఎన్నికల నియమావళి, నిబంధనలు, కొవిడ్ దృష్ట్యా ప్రభుత్వ మార్గదర్శకాలు, రోడ్ షోల నిర్వహణ తదితర అంశాలపై చర్చించామని వివరించారు.

వీధి సమావేశాల్లో 50 మందికి మించి ఉండరాదన్న నిబంధనలు ఉన్నాయని శశాంక్​ గోయల్​ (Huzurabad by poll) పేర్కొన్నారు. 20 కేంద్ర బలగాలు రాబోతున్నాయని.. వాటి వినియోగంపై సమీక్షలో చర్చించారు. ప్రచారం, డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ తదితర వాటిపై ఏమైనా ఫిర్యాదులు వస్తున్నాయా...తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ నెల 27న మరోసారి సమీక్ష నిర్వహిస్తామని ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్​ తెలిపారు. సమావేశంలో కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లు, పోలీసుల అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Mallu Ravi: 'రేవంత్​ రెడ్డిని చూస్తే కేసీఆర్​, కేటీఆర్​ల​కు వణుకు'

ABOUT THE AUTHOR

...view details