2020లో నమోదుచేసిన కేసులపై అవినీతి నిరోధక శాఖ (అనిశా) వార్షిక నివేదికను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి కేసుల్లో ఏసీబీకి చిక్కుతున్నవారిలో రెవెన్యూ శాఖ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రజల నుంచి లంచాలు తీసుకుంటూ ఈ ఏడాది 62 మంది ప్రభుత్వోద్యోగులు పట్టుబడగా.. వారిలో 28 మంది ఈ శాఖ వారే. ఆకస్మిక తనిఖీలు కూడా అత్యధికంగా రెవెన్యూ శాఖలోనే జరిగాయి. మొత్తం 97 ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా వాటిలో తహసీల్దార్ కార్యాలయాల్లో 32, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 18, దేవాదాయ శాఖలో ఒకటి జరిగిందని ఏసీబీ వెల్లడించింది.
పెరిగిన ఆకస్మిక తనిఖీలు