తెలంగాణ

telangana

ETV Bharat / state

'మరో 2 రోజులు రెవెన్యూ కార్యాలయాలు బంద్​'

తహసీల్దార్​ను సజీవ దహనం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రెవెన్యూ ఉద్యోగుల ఐకాస డిమాండ్​ చేసింది. మరో రెండు రోజుల పాటు విధులు బహిష్కరించనున్నట్లు వెల్లడించింది.

'మరో 2 రోజులు రెవెన్యూ కార్యాలయాలు బంద్​'

By

Published : Nov 5, 2019, 8:39 PM IST

'మరో 2 రోజులు రెవెన్యూ కార్యాలయాలు బంద్​'

తహసీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగుల ఐకాస డిమాండ్​ చేసింది. మరో రెండు రోజుల పాటు విధులు బహిష్కరించనున్నట్లు వెల్లడించింది. కార్యాలయాలను బంద్ చేసి కలెక్టరేట్ల ముందు రిలే నిరాహారదీక్షలు చేయాలని పిలుపునిచ్చింది. డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తహసీల్దార్ల సంఘం, వీఆర్ఓ, వీఆర్ఏల సంఘాలు, రెవెన్యూ సర్వీసెస్ సంఘంతో కూడిన ఐకాస ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

సీబీఐతో విచారణ జరిపించాలి..

విజ‌యారెడ్డి హ‌త్య రెవెన్యూ స‌మాజాన్ని తీవ్ర దిగ్భాంతికి గురి చేసిందని ఉద్యోగుల ఐకాస తెలిపింది. స‌జీవ ద‌హ‌నానికి దారి తీసిన అంశాల‌పై సీబీఐతో విచార‌ణ జ‌రిపించి... కుట్రదారులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేసింది. డ్రైవ‌ర్ గురునాథం కుటుంబంలో ఒక‌రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని కోరింది.

అన్ని రకాలుగా ఆదుకోవాలి

విజ‌యారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని ర‌కాలుగా ఆదుకోవాలని పేర్కొంది. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే తదుపరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. డ్రైవర్ గురునాథం కుటుంబానికి రెవెన్యూ ఉద్యోగుల ఒకరోజు జీతాన్ని ఇస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల ఐకాస ప్రకటించింది.

ఇవీ చూడండి: తహసీల్దార్ విజయారెడ్డి​ సజీవ దహనంపై చంద్రబాబు ఆవేదన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details