తెలంగాణ

telangana

'దుష్ప్రచారాలు అరికట్టి రెవెన్యూ శాఖను బలోపేతం చేయండి'

తహసీల్దార్​ విజయారెడ్డి హత్యతో రెవెన్యూ ఉద్యోగులంతా ఒక్కటయ్యారు. రెవెన్యూ ఐకాసగా ఏర్పడ్డ ఉద్యోగులంతా... ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ను కలిశారు. తమ డిమాండ్లు, విజ్ఞప్తులు సోమేశ్​కుమార్​కు విన్నవించుకున్నారు. రెవెన్యూ శాఖపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టి... బలోపేతం చేయాలని కోరారు.

By

Published : Nov 6, 2019, 11:30 PM IST

Published : Nov 6, 2019, 11:30 PM IST

REVENUE JAC MEET CS SOMESH KUMAR

'దుష్ప్రచారాలు అరికట్టి రెవెన్యూ శాఖను బలోపేతం చేయండి'

తహసీల్దార్ విజయారెడ్డి హత్యపై సిట్టింగ్ జడ్జీ చేత విచారణ జరిపించాలని రెవెన్యూ ఐకాస డిమాండ్ చేసింది. తీవ్రవాదుల దాడుల్లో మరణించినవారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని విజయారెడ్డి కుటుంబీకులకు ఇవ్వాలని ఐకాస కోరింది. రెవెన్యూ ఎంప్లాయిస్ అసోషియేషన్‌, డిప్యూటీ కలెక్టర్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌ అసోషియేషన్, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తదితర సంఘాలతో కూడిన రెవెన్యూ ఐకాస బృందం ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్‌ను కలిశారు.

సొంత ప్రాంతాలకు బదిలీచేయండి...

భూరికార్డుల ప్రక్షాళనలోని సాంకేతిక సమస్యలపై అధికారుల కమిటీ వేసి పరిష్కరించాలని సోమేశ్​ కుమార్‌ను రెవెన్యూ ఐకాస కోరింది. డ్రైవర్ గురునాథం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ ఉద్యోగులపై దుష్ప్రచారం అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వీఆర్వో, వీఆర్‌ఏలను కొనసాగించడంతోపాటు రెవెన్యూ శాఖను బలోపేతం చేయాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో బదిలీ చేసిన తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులను సొంత ప్రాంతాలకు బదిలీ చేయాలని సోమేశ్​ కుమార్‌కు రెవెన్యూ ఉద్యోగులు విన్నవించారు.

ఇవీ చూడండి: ఆర్టీసీపై 9గంటలపాటు సమీక్ష- ప్రత్యామ్నాయాలపై సీఎం దృష్టి

ABOUT THE AUTHOR

...view details