తెలంగాణ

telangana

ETV Bharat / state

Revenue Inspector Cheating On Double Bed Room Houses : డబుల్​ బెడ్​ రూం ఇళ్ల వెరిఫికేషన్​ పేరుతో రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ మోసం...!​ - రెవెన్యూ అధికారి డబుల్​బెడ్​రూం నేర వార్తలు బోరబండ

Revenue Inspector Cheating On Double Bed Room Houses : హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. యూసఫ్ గూడాలోని డబుల్ బెడ్ రూమ్​ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల వివరాలను వెరిఫై చేయుటకు, రవి అనే వ్యక్తి సుమారుగా 30 మంది లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad double bed room cheating news latest
Revenue Inspector Cheating On Double Bed Room Houses

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2023, 7:42 PM IST

Revenue Inspector Cheating On Double Bed Room Houses: వికారాబాద్ జిల్లాకు చెందిన రెవెన్యూ ఇన్​స్పెక్టర్ రవి.. గత రెండు రోజులుగా జీహెచ్​ఎంసీ యూసఫ్​గూడ పరిధిలోని డబుల్​ బెడ్​ రూం ఇళ్ల వెరిఫికేషన్​ నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా రెండు పడక గదుల ఇళ్లకోసం అప్లై చేసుకున్న వ్యక్తులను ​రవి వెరిఫికేషన్​ ముసుగులో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. అతను అడిగినట్టు డబ్బులు ఇవ్వకపోతే డబుల్​ బెడ్ ​రూం రద్దు చేస్తానని బెదిరించాడు. ఇక చేసేందేం లేక లబ్దిదారులు అడిగినంత డబ్బు ముట్టజెప్పారు. వెరిఫికేషన్​ కోసం వచ్చిన లబ్దిదారులు మహమ్మద్ ఫిరోజ్​ఖాన్, మునీర్, షబానా బేగం సహా మరో 20 నుంచి 30 మంది దగ్గర రూ.500 నుంచి రూ.5వేల వరకు వసూలు చేశాడు. అనంతరం బాధితులు మోసపోయామని గ్రహించి.. బోరబండ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కామల్ల రవి కుమార్​ తెలిపారు.

Cheating On Double Bed Room Houses in Hyderabad

Employees Do Ground Level Verification : మరోవైపు సెప్టెంబరు మొదటి వారం నుంచి దశలవారీగా ఈ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్​ నగరంలో నివసిస్తున్న పేద ప్రజలు ప్రభుత్వం ఉచితంగా కేటాయిస్తున్న రెండు పడకగదుల ఇళ్ల కోసం ముందు నుంచే దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపు 5వేల నుంచి 10వేల మంది దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటిని జీహెచ్​ఎంసీ అధికారులు, ఇతర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దరఖాస్తుదారులు అర్హులో.. కాదో నిర్ధారించారు. లక్షల్లో దరఖాస్తులు రాగా.. వాటిలో 50శాతం దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. మిగిలిన దరఖాస్తుదారుల పరిశీలనను అధికారులు పూర్తి చేయనున్నారు.

Double Bedroom House Lucky Draw in Hyderabad: హైదరాబాద్​లో లక్షా 61 వేయి మంది దరఖాస్తు చేసుకోగా 80వేల మంది చిరునామాలకు అధికారులు వెళ్లి వారి పరిస్థితులను పరిశీలించారు. 15 నియోజకవర్గాల పరిధిలో నుంచి అప్లికేషన్లు సమర్పించిన అభ్యర్థులను అధికారులు పరిశీలించి.. అన్ని వివరాలూ తెలుసుకుని, అనంతరం నివేదికను సిద్దం చేశారు. దాన్ని రెవెన్యూ అధికారులకు సమర్పించారు. కేవలం గ్రామీణ ప్రాంత ప్రజలకే కాకుండా హైదరాబాద్​ మహా నగర పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోనూ ఒక్కో నియోజకవర్గానికి 2500 మంది చొప్పున 60 వేల మంది జాబితాను సిద్ధం చేశారు. వీరందరిలో ఒక్కో నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేశారు. వీరి ఎంపిక పద్దతి లక్కిీ డ్రా ప్రక్రియ ద్వారా జరగనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అప్లికేషన్లు పెట్టుకున్న ప్రజలు వారి అదృష్టం పరీక్షించుకునేెందుకు ఎదురు చూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details