అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యను రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కార్యాయలంలోనే తహసీల్దార్‌ను సజీవ దహనం చేయడం అత్యంత దారుణ సంఘటనగా డిప్యూటీ కలెక్టర్స్ అసోషియయేషన్, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ నేతలు లచ్చిరెడ్డి, ఎస్.రాములు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. విధి నిర్వహణలో తోటి ఉద్యోగినిని కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు. ప్రతీ రెవెన్యూ ఉద్యోగి ఈ సంఘటనను ఖండించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు వెంటనే విధులు బహిష్కరించి బయటకు వచ్చి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి...