రేవెళ్ల కల్యాణ్ డిప్యూటేషన్‌పై కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్మార్క్స్(సీజీపీడీటీఎం) ఉపకార్యదర్శిగా నియమితులయ్యారు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్-2010 బ్యాచ్‌కు చెందిన కల్యాణ్... ప్రస్తుతం హైదరాబాద్‌లోని కస్టమ్స్‌లో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
కస్టమ్స్ జాయింట్ కమిషనర్‌కు సీజీపీడీటీఎం డిప్యూటీ సెక్రటరీగా డిప్యూటేషన్ - revella kalyan deputation news
హైదరాబాద్‌లోని కస్టమ్స్‌లో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రేవెళ్ల కల్యాణ్‌ను డిప్యూటేషన్‌పై కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రైడ్మార్క్ ఉపకార్యదర్శిగా నియమించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని అధికారులు తెలిపారు.
![కస్టమ్స్ జాయింట్ కమిషనర్‌కు సీజీపీడీటీఎం డిప్యూటీ సెక్రటరీగా డిప్యూటేషన్ revella kalyan deputation as a cgpdtm deputy secretary](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9192926-856-9192926-1602827367307.jpg)
కల్యాణ్‌ను ముంబయిలోని సీపీడీటీఎం డిప్యూటీ సెక్రటరీగా నియమకానికి కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్, ట్రైనింగ్- నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు కల్యాణ్... నాలుగు సంవత్సరాలు లేదా దానికి ముందే ఏదైనా ఉత్తర్వులు వచ్చేవరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఈయన జైపూర్‌లోని మాలావియా నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యారు. ప్రపంచ మేధో సంపత్తి సంస్థలో ఫెలోషిప్ శిక్షణ కూడా పొందారు.
ఇదీ చూడండి:త్రీడి వీడియోలు చూసి పురుడు పోసిన యువకుడు