RevanthReddy Comments on KCR : తెలంగాణకు విద్యుత్ చాలా ముఖ్యమని కాంగ్రెస్‌కు తెలుసని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. టీడీపీ ప్రభుత్వం 25,000 మంది మీద విద్యుత్ కేసులు పెట్టిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వేలాది మంది అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చారని చెప్పారు. ఇందులో భాగంగానే బషీర్‌బాగ్ వద్ద రైతులపై జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని చెప్పారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆనాడు టీడీపీకి సంబంధించిన హెచ్‌ఆర్‌డీ ఛైర్మన్‌గా కేసీఆర్ ఉన్నారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంత్రిగా.. గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక నేతగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్, పోచారం, గుత్తా వీళ్లంతా కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానాన్ని సమర్థించారని ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో కేసీఆర్, పోచారం భాగస్వాములేనని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
RevanthReddy Fires on BRS : టీఆర్ఎస్కు మొట్టమొదటగా నిధుల సాయం చేసింది.. టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన కోటి రూపాయలతోనే తెలంగాణ రాష్ట్ర సమితి ఫ్లెక్సీలు, పార్టీ సభ్యత్వ పుస్తకాలు ముద్రించారని చెప్పారు. చంద్రబాబుతో అంటకాగి బషీర్‌బాగ్ కాల్పల ఘటనకు కారణమయ్యారని విమర్శించారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటన తర్వాత కూడా 9 నెలల పాటు కేసీఆర్ తెలుగుదేశంలోనే ఉన్నారని రేవంత్రెడ్డివెల్లడించారు.
RevanthReddy on BRS :హరీశ్‌రావుకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్‌రెడ్డి అని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. వార్డు మెంబర్‌గా గెలవని హరీశ్‌ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ జీవితమంతా కాంగ్రెస్, తెలుగుదేశం పైనే ఆధారపడ్డారని వివరించారు. బొగ్గుగనులు ఉన్నచోటనే థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతామని ముఖ్యమంత్రి అన్నారని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.