CWC Meeting Update : గతంలో సిట్టింగ్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోగా.. ఇప్పుడు అందుకు భిన్నంగా సిట్టింగులు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanthreddy) తెలిపారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహించబోయే సీడబ్ల్యుసీ(CWC Meetings) సమావేశాలకు, జయభేరి బహిరంగ సభకు భద్రత కల్పించాలనిరాష్ట్ర డీజీపీ అంజన్‌కుమార్‌ను కోరినట్లు పేర్కొన్నారు.
Revanth Reddy Fire on BJP : 'బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై కుట్ర చేస్తున్నాయి'
రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టులు గాంధీభవన్ వచ్చి చర్చలు జరిపారన్న రేవంత్.. ఇప్పుడు తాను పీసీసీ చీఫ్ అయ్యాకే వస్తున్నారన్నారు. ఎన్నికలున్న వేరే రాష్ట్రాల్లో సీడబ్యూసీ సమావేశాలు నిర్వహించకుండా.. తెలంగాణకే అవకాశం ఇచ్చారంటే ఈ రాష్ట్ర కాంగ్రెస్‌కి జాతీయ నాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రెండేళ్లుగా కాంగ్రెస్ నిర్వహించినటువంటి సభలు.. అధికార పార్టీ కూడా చేయలేకపోయిందన్నారు.
Revanth on Joining's in Congress :రెండు సంవత్సరాలుగా తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీకి ప్రాధాన్యత పెరుగుతోందన్న రేవంత్‌రెడ్డి.. వ్యక్తులకు ప్రాధాన్యత పెరగలేదని స్పష్టం చేశారు. తాను పీసీసీ చీఫ్ అయ్యాక కొట్లాడి తమ నాయకులకు పదవులు తెస్తున్నట్లు చెప్పారు. అనేక మంది జాతీయ నాయకులు తెలంగాణకు క్యూ కట్టారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2021 జూలై వరకు 156 మంది కీలక నాయకులు కాంగ్రెస్‌ను వీడారన్నారు. 2021 జూలై నుంచి ఇప్పటి వరకు పార్టీ మారిన వాళ్ళు, కాంగ్రెస్‌లోకి వచ్చిన వాళ్ల లెక్క వేస్తె పార్టీకి ఎంత ప్రయోజనం చేకూరిందో తెలుస్తుందన్నారు.