Revanth Reddy Will Launch Mahalakshmi Scheme Today : తెలంగాణవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్రప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనుంది. జిల్లాల్లో పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, ట్సాన్స్‌జెండర్‌లకు ఆర్టీసీ బస్సుల్లోఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఒకటిన్నరకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీ ప్రాగంణంలో పథకాన్ని ప్రారంభిస్తారని లాంఛనంగా ప్రారంభిస్తారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. రెండు గంటల నుంచి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ గెలిస్తే మహిళలకు రిజర్వేషన్, ఉచిత ప్రయాణం!
మహిళలకు వయసుతో సంబంధం లేకుండా బస్సుల్లో ఉచిత ప్రయాణం : రాష్ట్రంలో నివాసం ఉంటే మహిళలందరికీ వయస్సుతో సంబంధం లేకుండా ఈ పథకం వర్తించనుంది. రోజు బస్సుల్లో కిలోమీటర్ల మేర ప్రయాణించే విద్యార్థినులకు ఎక్కువస్థాయిలో ఉపశమనం లభించనుంది. ప్రయాణ సమయంలో స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. ఆ వెంటనే వారికి జీరో టికెట్ మంజూరు చేస్తారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణించే వారికి ప్రయాణ పరిధి విషయంలో ఎలాంటి పరిమితులుండవని అధికారులు తెలిపారు. అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) వెల్లడించారు.
Congress Mahalakshmi Scheme in Telangana : మహాలక్ష్మీ పథకం అమలుకు ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్దమైందని సజ్జనార్ తెలిపారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే దాదాపు 40,000ల మంది డ్రైవర్లు, కండక్టర్లతో 8వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సార్లు వర్చువల్‌గా సమావేశాలు నిర్వహించామన్నారు. ఉచిత బస్సు ప్రయాణ మార్గదర్శకాలను డ్రైవర్లు, కండక్టర్లకు వివరించినట్లు సజ్జనార్ పేర్కొన్నారు.