తెలంగాణ

telangana

ETV Bharat / state

'కోర్టుకు నివేదిక ఇవ్వకుండానే వివరాలన్నీ కేటీఆర్‌ ఎలా చెప్పారు..?'

Revanth Reddy Criticized KTR In TSPSC Paper Leakage Case: రాష్ట్రవ్యాప్తంగా టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసు సంచలనంగా మారింది. తాజాగా ఈ విషయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి మాట్లాడారు. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలియాలంటే మంత్రి కేటీఆర్​ను ప్రశ్నించాలని సూచించారు. సీబీఐకు అప్పగించాలని కోరారు.

revanth reddy
revanth reddy

By

Published : Mar 28, 2023, 2:28 PM IST

Updated : Mar 28, 2023, 2:48 PM IST

'కోర్టుకు నివేదిక ఇవ్వకుండానే వివరాలన్నీ కేటీఆర్‌ ఎలా చెప్పారు..?'

Revanth Reddy Criticized KTR In TSPSC Paper Leakage Case: టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసులో కోర్టు నివేదిక ఇవ్వకుండానే వివరాలన్నీ మంత్రి కేటీఆర్​ ఎలా చెప్పారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. దిల్లీ నుంచి మీడియా సమావేశంలో కేటీఆర్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్​ మాట్లాడారు. ఈ పేపర్​ లీకేజీని చూస్తే.. టీఎస్​పీఎస్సీ సభ్యుల నియామకంలోనే అవకతవకలు జరిగినట్లు తెలుస్తోందని ఆరోపించారు.

అర్హత లేని వారిని కమిషన్​ సభ్యులుగా నియమించారని రేవంత్​రెడ్డి ధ్వజమెత్తారు. వీరి వల్లే గ్రూప్​-1 ప్రిలిమ్స్​ పరీక్షలో ఎన్నో అక్రమాలు జరిగినట్లు భావిస్తున్నామన్నారు. ఏడాది క్రితం జరిగిన గ్రూప్​-1 ప్రిలిమ్స్​ పరీక్షను లాలాగూడ కేంద్రంలో.. కొందరు అభ్యర్థులు సమయం దాటిన తర్వాత కూడా పరీక్షను రాశారని తెలిపారు. అప్పుడే ఆ విషయం బయటకు వచ్చినా అధికార పార్టీ కనీసం స్పందించలేదని పేర్కొన్నారు.

ఈ కేసులో మొదటి నుంచి మంత్రి కేటీఆర్​ వ్యవహర శైలి భిన్నంగా ఉందని చెబుతున్నా.. సిట్​ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అసలు ఈ కేసుతో ఇద్దరికే సంబంధం ఉందని కేటీఆర్​ ఎలా చెప్పుతారన్నారని అడిగారు. పోలీసులు దర్యాప్తును ప్రారంభించక ముందే.. ఇద్దరు వ్యక్తులే పేపర్ల లీకేజీకి కారణమని ఎట్లా చెప్పుతారని విమర్శలు చేశారు. సిట్​ చెప్పాల్సిన వివరాలను మంత్రి ఎలా చెపుతున్నారని ప్రశ్నించారు. ఏ జిల్లాలో ఎంత మంది పరీక్షలు రాశారు.. వారికి ఎన్ని మార్కులు వచ్చాయో కూడా కేటీఆర్ ఎలా​ చెప్పారని గుర్తు చేశారు.

TSPSC Paper Leakage Case: సిట్​ అధికారులు కోర్టుకు నివేదిక ఇవ్వక ముందే.. ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నీ కేటీఆర్​కు ఎలా తెలుసునని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ సిట్​ అధికారి అయినట్లు వివరాలన్నీ చెప్పారని.. ఆయన కనుసన్నల్లోనే దర్యాప్తు మొత్తం జరుగుతోందని ఆరోపించారు. దర్యాప్తులో వెలుగుచూసిన విషయాన్ని ఐటీ మంత్రికి నిందితులు చెప్పారా? లేకపోతే సిట్​ అధికారి చెప్పారా అని ప్రశ్నించారు. కేటీఆర్​కు నోటీసులు ఇవ్వడం మాని.. తనకు నోటీసులు ఇచ్చారన్నారు. పేపర్​ లీకేజీలో కేటీఆర్​కు నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని సిట్​ అధికారులను డిమాండ్​ చేసినట్లు రేవంత్​రెడ్డి తెలిపారు.

మొదటి నుంచి ఈ కేసును సీబీఐకు అప్పగించాలని తాను కోరుతున్నానని చెప్పారు. గత మూడు రోజుల నుంచి సీబీఐ, ఈడీ అపాయింట్​మెంట్​ గురించి ప్రయత్నిస్తున్నానని.. ఇప్పటివరకు అపాయింట్​మెంట్​ దొరకలేదన్నారు. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసులో కోట్ల రూపాయలు కుంభకోణం, మనీలాండరింగ్​ జరిగిందని ఆరోపించారు. ఇందులో పాలకులు, ప్రభుత్వం అధికారుల పాత్ర ఉందన్నారు. అందుకే ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్​ చట్టాలు వర్తిస్తాయని రేవంత్​రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

"మంత్రి కేటీఆర్‌ కనుసన్నల్లోనే సిట్‌ దర్యాప్తు జరుగుతోంది.సిట్‌ చెప్పాల్సిన వివరాలు మంత్రి కేటీఆర్‌ ఎలా చెప్తున్నారు.కోర్టుకు నివేదిక ఇవ్వకుండానే వివరాలన్నీ కేటీఆర్‌ ఎలా చెప్పారు?. సిట్‌ అధికారి అయినట్లు మంత్రి కేటీఆర్‌ వివరాలన్నీ ఎలా చెప్తారు. మంత్రి కేటీఆర్‌ కనుసన్నల్లోనే దర్యాప్తు జరుగుతోంది. కేటీఆర్‌కు దర్యాప్తు సమాచారం.. మాకేమో నోటీసులా." - రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated : Mar 28, 2023, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details