తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం కోసం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా బయలుదేరారు. ముందుగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి(peddamma thalli) గుడికి వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు తమ నేతను గజమాలతో సత్కరించారు. అనంతరం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో రహదారులు నిండిపోయాయి. ర్యాలీకి అడ్డంకులు లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ర్యాలీ మధ్యలో నాంపల్లి యూసుఫైన్ దర్గాలో రేవంత్ ప్రార్థనలు చేయనున్నారు. తర్వాత గాంధీభవన్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం గాంధీభవన్‌లో నిర్వహించబోయే సభలో ప్రసంగిస్తారు.