తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఫాంహౌస్​లో కేసీఆర్.. ధాన్యం కుప్పల వద్ద రైతుల పడిగాపులు'

Revanth tweet on cm kcr: రైతులు ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తుంటే సీఎం కేసీఆర్ కుంభకర్ణుడిలా సేద తీరి వచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి విమర్శించారు. అకాల వర్షాల వల్ల అన్నదాతలు నష్టపోయారని ట్విటర్ వేదికగా ఆరోపించారు.

రేవంత్​ రెడ్డి
రేవంత్​ రెడ్డి

By

Published : May 17, 2022, 1:41 PM IST

Revanth tweet on cm kcr: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. రైతులు ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తుంటే... కేసీఆర్‌ 16రోజులు కుంభకర్ణుడిలా ఫాంహౌస్‌లో సేద తీరి వచ్చారని విమర్శించారు. ఐకేపీ కేంద్రాలలో టార్పాలిన్‌లు గతిలేక రైతు కష్టం వర్షపు నీటిలో కొట్టుకుపోయిందని ట్విటర్‌ వేదికగా ఆరోపించారు. ఇదేం రాక్షసత్వం కేసీఆర్‌ అంటూ సంబోధించిన రేవంత్‌ రెడ్డి... కర్షకులే నీకు కర్రుకాల్చి వాత పెట్టుడు ఖాయమని తెలిపారు.

అకాల వర్షాల వల్ల అన్నదాతల ఇబ్బందులు:నిన్న రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు జగిత్యాల, మెదక్, నిజామాబాద్, నిర్మల్, మేడ్చల్ జిల్లాల్లో అన్నదాతలు అతలాకుతలం అయ్యారు. పలు గ్రామాల్లో భారీ వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది., మొక్కజొన్న, సజ్జ, నువ్వు, మామిడి పంటలు నేలవాలాయి. అకాల వర్షాలతో ఏమి చేయలేని రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండడంతో ధాన్యం కుప్పలు వరదనీటిలో మునిగిపోయాయి. వరద నీరు ధాన్యం. కుప్పల వద్దకు చెరి ధాన్యాన్ని నీట ముంచాయి. మరోవైపు పంట పొలాలలో వేసిన నువ్వు, మొక్కజొన్న పంటలు నెలకొరిగాయి.

ABOUT THE AUTHOR

...view details