Revanth Reddy Special Thanks to Congress Activists :తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక తుది తీర్పే తరువాయి. డిసెంబరు మూడో తేదీన ప్రజా తీర్పు వెలువడనుంది. ఈ క్రమంలో అన్ని ఎగ్జిట్ పోల్స్(Exit Polls 2023) సర్వేలు రాష్ట్రంలో అధికారం దక్కించుకునేది.. కాంగ్రెస్ పార్టీనే అని ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎక్స్(ట్విటర్) వేదికగా కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశిస్తూ.. ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికీ పేరుపేరున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఎక్స్(ట్విటర్)లో ధన్యవాదాలు తెలిపారు. గడిచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని అభినందించారు.
Telangana Election Polls 2023 :మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతూ ఎక్స్ వేదికగా రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. అలాగే గురువారం జరిగిన సమావేశంలో ఏ ఎగ్జిట్ పోల్ చూసినా తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం అని చెబుతున్నాయని చెప్పారు.
"ధన్యవాదాలు.. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారు. మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిది. ప్రతి ఒక్కరికీ అభినందనలు."- రేవంత్ రెడ్డి ట్వీట్