Revanth Reddy To Meet Ponguleti And Jupally Today :మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుసహా ముఖ్యనేతలు జులై 2న ఖమ్మంలో జరిగే బహిరంగసభలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు. ఈ మేరకు కార్యక్రమం ఖరారైనట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అంతకుముందే ఈ నాయకులిద్దరూ.. ఈ నెల 25న దిల్లీలో రాహుల్‌గాంధీతో సమావేశమై చర్చించి.. 26న దిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటిస్తారని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇవాళపొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. తర్వాత జూపల్లిని కూడా కలవనున్నారు. రాహుల్‌గాంధీతో సమావేశం, ఖమ్మం బహిరంగ సభ గురించి వారితో చర్చించనున్నారు.
- Congress Operation Akarsh : మూడో కంటికి తెలియకుండా కాంగ్రెస్ 'ఆపరేషన్ ఆకర్ష్'..!
- Revanthreddy to Meet Ponguleti : రేపు పొంగులేటి ఇంటికి రేవంత్... పార్టీలో చేరికపై అధికారిక ప్రకటన.!
Ponguleti Srinivasa Reddy to Join Congress Party :పొంగులేటి, జూపల్లితో గత మూడు, నాలుగు రోజులుగా బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. జరిపిన చర్చలు కొలిక్కి రాకపోగా.. చివరకు ఎవరిదారి వారిదే అని నిర్ణయించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి, జూపల్లితో బీజేపీ నేతలు మొదట చర్చలు జరిపారు. రాష్ట్రంలో అధికార పార్టీని బీజేపీనే గట్టిగా ఎదుర్కోగలదనే అంచనాతో పాటు ఈటల రాజేందర్‌తో వారికున్న స్నేహంతో పలు దఫాలు చర్చలు జరిగాయి. కానీ ఖమ్మం జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరడమే మంచిదనే అభిప్రాయం అనుచరుల నుంచి వ్యక్తం కావడం, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం వంటి కారణాలతో పొంగులేటి, జూపల్లి ఊగిసలాటలో పడ్డారు. రాష్ట్రంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ను ఓడించాలంటే ఆ పార్టీ వ్యతిరేకులంతా ఓ గ్రూపుగా ఏర్పడి కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడం లేదా అందరూ కలిసి ఒకే పార్టీలోకి వెళ్లడం తదితర ప్రత్యామ్నాయాలపై ఈ నాయకులంతా కలిసి నెల రోజులుగా తరచూ చర్చలు జరిపారు.