ORR lease agreement scam : ఓఆర్ఆర్ కేటీఆర్ ధనదాహానికి బలైందని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబం దారిదోపిడీ దొంగతనానికి పాల్పడిందని విమర్శించారు. బేస్ ప్రైస్ లేకుండా ఓఆర్ఆర్ టెండర్లు పిలవడంపై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోందన్న ఆయన.. ఓఆర్ఆర్ లీజులో 30రోజుల్లోగా 10శాతం, 120 రోజుల్లోగా పూర్తి డబ్బును ఐఆర్బీ సంస్థ డబ్బు చెల్లింపునకు సంబంధించి కన్సెషన్ అగ్రిమెంట్లో 20, 21 పేజీలో స్పష్టంగా నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాము చెప్పింది 10శాతమే.. కానీ వాస్తవంగా 30 రోజుల్లో 25 శాతం టెండర్ పొందిన సంస్థ చెల్లించాలని అగ్రిమెంట్లో ఉన్నట్లు వెల్లడించారు. ఓఆర్అర్ లీజు ఒప్పందం ఐఆర్బీ సంస్థతో ఏప్రిల్ 27, 2023న లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగిందని.. ఈ రోజుతో 30 రోజుల గడువు ముగిసిందని పేర్కొన్నారు. అగ్రిమెంట్ ప్రకారం నియమ నిబంధనలు ఉల్లంఘించిన IRB సంస్థ టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Delhi liqour scam : ఇప్పటి వరకు రూపాయి చెల్లించని ఐఆర్బీ సంస్థ టెండర్‌ను రద్దు చేయమంటే ప్రభుత్వం బుకాయిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఒకవేళ నిబంధనలు ఏమైనా మార్చి ఉంటే.. ఆ మార్చిన నిబంధనలు ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో టెండర్ నిబంధనలు సరళీకృతం చేసి కేసీఆర్ కుటుంబం రూ.100 కోట్ల స్కాం చేసిందని దుయ్యబట్టారు.
దిల్లీ లిక్కర్ స్కాం లాగే.. ఓఆర్ఆర్ టెండర్ కూడా పెద్ద స్కామ్ అని.. ఈ అంశంలో తను, బీజేపీ నేత రఘునందన్ చెప్పిన వివరాలు ఒక్కటే అని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఓఆర్ఆర్ టెండర్‌పై సీబీఐకి ఫిర్యాదు చేశారన్న ఆయన.. మరి బండి సంజయ్, కిషన్ రెడ్డి ఓఆర్ఆర్ అంశంపై ఎందుకు విచారణకు ఫిర్యాదుచేయడం లేదని ప్రశ్నించారు.
వారు అవిభక్త కవలలు.. ఓఆర్ఆర్ అగ్రిమెంట్లో బయటపెట్టిన నిబంధనలు నిజమా కాదా చెప్పాల్సిన బాధ్యత అర్వింద్ కుమార్, సోమేశ్ కుమార్‌పై ఉందన్నారు. ఈ అంశంపై కేటీఆర్ స్పందించాలి.. లేకపోతే అర్వింద్ కుమార్ మాట్లడాలని డిమాండ్ చేశారు. దీనిపై పూర్తి బాధ్యత అర్వింద్ కుమార్‌పై ఉందని.. లేకపోతే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ముందు నుంచి చెబుతున్నట్లు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని.. కేసీఆర్, మోదీ అవిభక్త కవలలని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మైనారిటీ ఓట్లను మోదీకి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.
బీజేపీ అసలు రంగు బయటపడిందని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ను ఓడించడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని.. ఇప్పటికైనా భ్రమలు వీడి బీజేపీలో కొనసాగుతూ ఉక్కిరి బిక్కిరవుతున్న నేతలు కాంగ్రెస్‌లోకి కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఏ హామీలు అమలు చేశారని, ప్రజలకు ఏం నమ్మకం కలిగించారని హరీష్ తమ పాలనను సమర్దించుకుంటారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బిస్వాల్ కమిటీ చెప్పినట్టు ఇప్పటి వరకు 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్న ఆయన.. కేటీఆర్, హారీశ్‌రావు సెక్యూరిటీ లేకుండా ఓయూకి వెళ్లి నిరుద్యోగులతో చర్చించాలని సవాల్ విసిరారు.
"ఓఆర్ఆర్ కేటీఆర్ ధన దాహానికి బలైంది. దిల్లీ లిక్కర్ స్కాం లాగే.. ఓఆర్ఆర్ టెండర్ కూడా పెద్ద స్కామ్. ఇంతా జరుగుతున్నా బీజేపీ పట్టించుకోవడం లేదు. ఓఆర్ఆర్ లీజులో 30రోజుల్లోగా 10శాతం, 120 రోజుల్లోగా పూర్తి డబ్బును ఐఆర్బీ సంస్థ ఓఆర్ఆర్ లీజు డబ్బు చెల్లింపునకు సంబంధించి కన్సెషన్ అగ్రిమెంట్లో 20, 21 పేజీలో స్పష్టంగా నిబంధనలు ఉన్నాయి. నిబంధనలు మార్చారా? దీనిపై కేటీఆర్ స్పందించాలి.. లేకపోతే అర్వింద్ కుమార్ మాట్లాడాలి." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
'దిల్లీ లిక్కర్ స్కామ్ కంటే.. ఓఆర్‌ఆర్ లీజు వెయ్యిరెట్ల పెద్ద స్కామ్' ఇవీ చదవండి: