తెలంగాణ

telangana

ETV Bharat / state

revanth salutes to farmer: అద్భుతమైన పాట పాడిన 93 ఏళ్ల రైతుకు రేవంత్​రెడ్డి పాదాభివందనం - telangana varthalu

revanth salutes to farmer: రైతుల సమస్యలు, శాశ్వత పరిష్కారంపై అద్భుతమైన పాట పాడిన 93 ఏళ్ల రాంరెడ్డి అనే వ్యక్తిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అభినందించారు. వేదికపైనే ఆయనకు పాదాభివందనం(revanth salutes to farmer) చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయనను అభినందించి ఆలింగనం చేసుకున్నారు.

revanth salutes to farmer: అద్భుతమైన పాట పాడిన రైతుకు రేవంత్​రెడ్డి పాదాభివందనం
revanth salutes to farmer: అద్భుతమైన పాట పాడిన రైతుకు రేవంత్​రెడ్డి పాదాభివందనం

By

Published : Nov 28, 2021, 3:39 PM IST

revanth salutes to farmer: అద్భుతమైన పాట పాడిన రైతుకు రేవంత్​రెడ్డి పాదాభివందనం

revanth salutes to farmer: రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం పైనా 93ఏళ్ల రైతు అద్భుతమైన పాట పాడి ఆకట్టుకున్నారు. ఈ ఆసక్తికర సంఘటన ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 'వరిదీక్ష'లో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన 93 ఏళ్ల రాంరెడ్డి అనే రైతు స్వయంగా పాట రాసి వరిదీక్షలో పాడారు. ఈ పాటలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి శాశ్వత పరిష్కారం చూపుతూ పాట పాడారు. ఆయన పాడిన పాటతో సభావేదికపై ఉన్న నేతలతోపాటు దీక్షకు హాజరైన సభికులు కరతాళధ్వనులతో అభినందనలు తెలిపారు.

పాటపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(tpcc chief revanth reddy) రాంరెడ్డిని అభినందించి వేదిక మీద పాదాభివందనం చేశారు. ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఆ రైతును అభినందించారు. కోమటిరెడ్డి రేవంత్‌రెడ్డితో కలిసి ఆలింగనం చేసుకున్నారు. వరి దీక్ష సభకు అధ్యక్షత వహించిన టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి రైతు రాంరెడ్డి రాసిన పాటను ముద్రించి పంచిపెడతానని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details