తెలంగాణ

telangana

ETV Bharat / state

'గాంధీ ఆసుపత్రి వద్ద నిత్యం వెయ్యి మందికి ఉచిత భోజనం' - mp revanth reddy started Free meals programme at Gandhi Hospital

గాంధీ ఆసుపత్రి వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం వెయ్యి మంది వైద్య సిబ్బంది, కరోనా రోగులు, వారి బంధువులకు భోజనం అందిస్తామని రేవంత్‌ తెలిపారు. లాక్‌డౌన్ ఉన్నంత వరకు కార్యక్రమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత భోజనం
గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత భోజనం

By

Published : May 15, 2021, 4:00 PM IST

గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత భోజనం

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతోన్న వారికి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వద్ద భోజనం అందిస్తామని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోనియా, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రోజూ వెయ్యి మంది వైద్య సిబ్బంది, కరోనా బాధితులు, వారి బంధువులకు ఉచిత భోజనం అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్ ఉన్నంత వరకు భోజన వసతి కల్పిస్తామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం కనీసం కరోనాపై పోరాడుతున్న వైద్యులు, నర్సులకు ఆహారం ఏర్పాటు చేయలేదని రేవంత్‌ రెడ్డి ఆక్షేపించారు. విపత్తు వేళ కార్పొరేట్ ఆసుపత్రులు కాసులు దండుకోవడమే లక్ష్యంగా పనిచేయడం దారుణమని ఎంపీ మండిపడ్డారు.

ఇదీ చూడండి: కొవిడ్‌ బాధితులకు పోలీసుల సాయం.. ఇంటివద్దకే భోజనం

ABOUT THE AUTHOR

...view details