తెలంగాణ

telangana

ETV Bharat / state

'67 వేల కోట్లు ఖర్చు పెడితే అమరావతి కంటే బాగుండేది'

ఎంఐఎం, భాజపా చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ సెక్యులర్‌ ఓట్లు చీల్చేందుకే.. భాజపా, ఎంఐఎం కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. మూసి ప్రక్షాళనకు 12 వేల కోట్లు ఖర్చు పెడితే ఈ వరద ముప్పు నుంచి హైదరాబాద్​ బయటపడేదని తెలిపారు. అదే 67 వేల కోట్లు హైదరాబాద్​లో ఖర్చు పెడితే నూతన అమరావతి కంటే హైదరాబాద్​ ఎక్కువగా అభివృద్ధి అయ్యేదని అన్నారు.

revanth reddy said 67,000 crore expense in hyderabad better than Amravati capital
'67 వేల కోట్లు ఖర్చు పెడితే అమరావతి కంటే బాగుండేది'

By

Published : Nov 29, 2020, 5:11 PM IST

'67 వేల కోట్లు ఖర్చు పెడితే అమరావతి కంటే బాగుండేది'

నల్ల మైసమ్మ ఆలయ ప్రదేశాన్ని భాజపా నేతలు ఎందుకు సందర్శించలేదని ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ ఫిరాయింపులు ప్రోత్సహించి పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేశారని తెలిపారు.

తెరాస ప్రభుత్వం భాగ్యనగర అభివృద్ధికి 67 వేల కోట్ల ఖర్చు పెడితే.. నూతన అమరావతి కంటే ఎక్కువగా అభివృద్ధి చెందేదని అన్నారు. 2016లో ఇచ్చిన హామీలను తెరాస వెబ్​సైట్​ నుంచి ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు.

మూసి ప్రక్షాళనకు 12 వేల కోట్లు ఖర్చు పెడితే ఈ వరద ముప్పు నుంచి హైదరాబాద్​ బయటపడేదని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే తెరాస ప్రభుత్వం అమలు చేయలేదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి :సచివాలయం లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి: కిషన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details