రాష్ట్రంలో ప్రశ్నించేవాడు ఉండకూడదని తెరాస ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నారై కోటాలో ఎమ్మెల్యే టికెట్, పేమెంట్ కోటాలో మంత్రి పదవి తెచుకున్నాడని, వేలంపాటలో ఎంపీ టికెట్‌తో అల్లుడిని పోటీలో దించాడని మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో ఐడీపీయల్ చౌరస్తా నుంచి చింతల్, భగత్ సింగ్ నగర్ మీదుగా రోడ్ షో కొనసాగింది. మల్కాజిగిరి పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు. గెలిచిన వెంటనే నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు.
ప్రశ్నించే గొంతుకను గెలిపించండి: రేవంత్‌రెడ్డి - Revanth reddy road show in Quthbullapur
పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయం దగ్గర పడుతున్న వేళ మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఇవాళ కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. అభిమానులు, మహిళలు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని రేవంత్ రెడ్డి కి బ్రహ్మరథం పట్టారు.

ప్రశ్నించే గొంతుకను గెలిపించండి: రేవంత్‌రెడ్డి
Last Updated : Apr 3, 2019, 7:59 AM IST