Revanth Reddy Protest: కొత్త రాజ్యాంగాన్ని తేవాలనే ఆర్‌ఎస్‌ఎస్, భాజపా కుట్రలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సహచర ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి నిరసన చేపట్టారు. సీఎం కేసీఆర్ తీరును జాతీయస్థాయిలో ఎండకట్టేలా... రేపు పార్లమెంటులో వాయిదా తీర్మానం ఇస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
పార్లమెంట్లో రాజ్యాంగంపై తెరాస ఎంపీ కేశవరావు మాట్లాడితే మా నాయకుడు మల్లికార్జున ఖర్గే వెంటనే ఖండించారు. రేపు మేమంతా పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చి స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈరోజు అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టినం. రేపు వాయిదా తీర్మానం ఇచ్చి ఎంపీలందరి దృష్టికి తీసుకెళ్తాం. కేసీఆర్ మీద చర్యలు తీసుకునే విధంగా కాంగ్రెస్ చర్యలు చేపడుతుంది.