రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్లో పూర్తి స్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేసే వరకు కొత్తపేటలోనే మార్కెట్ కొనసాగించాలని రేవంత్‌రెడ్డి అన్నారు. మౌలిక వసతులు లేకుండా రాచకొండ గుట్టల్లోని కోహెడకు రాత్రికి రాత్రే మార్కెట్‌ను ఎందుకు తరలించారని మండిపడ్డారు.
మంత్రుల పరామర్శ ఏదీ ?
రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని రేవంత్ తప్పుబట్టారు. హడావుడిగా.. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌ను కోహెడకు ఎందుకు తరలించారో ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు. తాత్కాలిక షెడ్డు కూలి 26 మందికి తీవ్ర గాయాలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతజరిగినా మంత్రులు పరామర్శించిన దాఖలాలే లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహెడ ఘటనలో గాయపడిన వారిందరికీ రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.