Revanth Reddy letter to Telangana farmers : రైతు వేదికల సాక్షిగా పోరాటానికి సిద్ధమైన బీఆర్ఎస్ కార్యాచరణకు కాంగ్రెస్ ఎదురుదాడి వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇదే రైతు వేదికలపై బీఆర్ఎస్ ప్రభుత్వ రైతు వేదిక విధానాలపై నేతల్ని నిలదీయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు బహిరంగ లేఖ రాశారు. రైతు వేదికలను ఇన్నాళ్లూ అలంకార ప్రాయంగా ఉంచిన ఆ పార్టీ.. ఇప్పుడు వాటిని రాజకీయ వేదికలుగా మార్చేందుకు బరి తెగించిందని మండిపడ్డారు.
రైతు రుణమాఫీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశామని.. చివరి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టడం అయిపోయిందని తెలిపారు. రుణమాఫీ చేయబోదన్న విషయం స్పష్టత వచ్చేసిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య అక్షరాలా 31 లక్షలు ఉండగా రూ.20 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేయాల్సిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ మాటలకు మోసపోయి అప్పుల ఊబిలో చిక్కిన మన సహచరులు దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని పేర్కొన్నారు.
- Revanth Reddy Warning To Party Activists : నిబంధనలు ఉల్లంఘిస్తే సస్పెండే.. కార్యకర్తలకు రేవంత్ హెచ్చరిక
- KTR Vs Revanth Reddy : 'తెలంగాణలో కాంగ్రెస్‌ని.. ఓ పోకిరి చేతుల్లో పెట్టారు'
Revanth Reddy fires on KCR : ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. జూన్ 15 నాటికి రూ.6 వేల 800 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత తొమ్మిదేళ్లలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుంచి ప్రభుత్వం లాక్కుందని పేద గిరిజన, దళిత బిడ్డలకు భూములు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రాలేదని మండిపడ్డారు.