తెలంగాణ

telangana

ETV Bharat / state

'బీఆర్​ఎస్ పాలనలో మీ అవస్థలు, మీకు జరిగిన అవమానాలు తెలుసు - మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదో అవకాశం' - Telangana Assembly Elections 2023

Revanth Reddy Open Letter to Local Public Representatives : రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలోని స్థానిక ప్రజాప్రతినిధులకు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్‌ పాలనలో మీ అవస్థలు, మీకు జరిగిన అవమానాలు తనకు తెలుసని చెప్పారు. ఈ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని.. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదో అవకాశమని రేవంత్‌రెడ్డి లేఖలో వివరించారు.

Revanth Reddy
Revanth Reddy

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 11:56 AM IST

Updated : Nov 26, 2023, 12:13 PM IST

Revanth Reddy Open Letter to Local Public Representatives : తెలంగాణలోని స్థానిక ప్రజాప్రతినిధులకు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితిపై తాను లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ ప్రభుత్వ పాలనకైనా.. మీరే పునాదులని చెప్పారు. జడ్పీటీసీగా చేసిన తనకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత గుర్తని అన్నారు. భారత రాష్ట్ర సమితి పాలనలో.. మీ అవస్థలు, మీకు జరిగిన అవమానాలు తెలుసని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

దొరల రాజ్యాన్ని గద్దె దింపాలి- ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి: రేవంత్​రెడ్డి

Telangana Assembly Elections 2023 :ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజాప్రతినిధులను పురుగులకంటే హీనంగా చూశారని రేవంత్‌రెడ్డి (Revanth Reddy)తెలిపారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ నిధులు రాకుంటే ఆస్తులు, బంగారం అమ్మి పనులు చేశారని గుర్తు చేశారు. ఊరి కోసం అప్పులు చేసి, వడ్డీలు కట్టలేక.. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా, వాచ్‌మెన్లుగా చేస్తున్నారని రేవంత్‌రెడ్డి వివరించారు.

మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదొక అవకాశం : భారత రాష్ట్ర సమితి పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులు అత్యంత కీలకమని అన్నారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టాలని కోరారు. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి.. ఇదొక అవకాశమని వివరించారు. రేపు మీ కష్టాలు తీర్చి, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

కేసీఆర్‌ను ఓడిస్తేనే పేదలందరికి ఇళ్లు వస్తాయి : రేవంత్‌రెడ్డి

బీఆర్ఎస్, కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం : స్థానిక సంస్థలకు పూర్వ వైభవాన్ని తెచ్చే బాధ్యత.. కాంగ్రెస్ తీసుకుంటుందని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్‌, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుపుకు.. మీ వంతు పాత్ర పోషించాలని కోరారు. మీ పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుందని చెప్పారు. పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా.. వార్డు సభ్యుడు నుంచి సర్పంచ్ వరకు.. కౌన్సిలర్ నుంచి మున్సిపల్ ఛైర్మన్‌ వరకు.. కార్పొరేటర్ నుంచి మేయర్ల వరకు అందరికీ ఇదే విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్లు రేవంత్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Revanth Reddy Open Letter to Telangana Public :ఇటీవలే రేవంత్‌రెడ్డి .. తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న ఐటీ, ఈడీ (IT and ED Raids on Congress Leaders )దాడుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దేశంలోని అత్యున్నత ప్రభుత్వ సంస్థలు.. రాజ్యాంగ వ్యవస్థలను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై.. హస్తం పార్టీ నాయకుల ఇళ్లపై.. ఆదాయపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ల చేత దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ఆ రెండు పార్టీల్లో చేరిన వారు పవిత్రులు.. ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులా అంటూ రేవంత్‌రెడ్డి లేఖలో ప్రశ్నించారు.

ఈసారి రెండుచోట్ల కేసీఆర్‌కు ఓటమి తప్పదు: రేవంత్‌రెడ్డి

దుబ్బాక నిధులను మామా, అల్లుళ్లు సిద్దిపేటకు ఎత్తుకుపోవడం అలవాటైపోయింది : రేవంత్​రెడ్డి

Last Updated : Nov 26, 2023, 12:13 PM IST

ABOUT THE AUTHOR

...view details