Revanth Reddy Open Letter to CM KCR : తెలంగాణలో బీసీ కుల గణన చేయాలని ఉన్న డిమాండ్‌ను వెంటనే చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. కేవలం బీసీ కుల గణన తర్వాతే వారికి న్యాయం జరుగుతుందని.. తక్షణమే బీసీ కుల గణనతో పాటు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.
బీసీ కుల గణన తర్వాతే అప్పుడే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయంగా కావాల్సిన వాటా దక్కుతుందని ఆశిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని లేఖ ద్వార తెలిపారు. తెలంగాణలో బీసీ కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ ఉందని వివరించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందన్నారు. ఈ విషయంలో బీసీ సంఘాలు చేపట్టిన ప్రతి నిరసనకి, ఉద్యమానికి హస్తం పార్టీ అండగా నిలిచిందని తెలిపారు.
తెరాస, భాజపా ఒక్కటేనంటూ రేవంత్ బహిరంగ లేఖ
మహిళా బిల్లు పార్లమెంటులో ఆమోదించిన సమయంలో కూడా మా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈ అంశాన్ని ప్రస్తావించారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా.. బిహార్ రాష్ట్రంలో బీసీ కుల గణనను విజయవంతంగా చేపట్టిందని లేఖ ద్వారా గుర్తు చేశారు. దానికి సంబంధించిన వివరాలు కూడా విడుదల చేశారని తెలిపారు. కేవలం బీసీ కుల గణనతోనే వారికి న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో బీసీ కుల గణనతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 ప్రకారం వారికి విద్య, ఉద్యోగాల్లో కల్పించిన రిజర్వేషన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేసే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు.