తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను బలి తీసుకునేది కాళేశ్వరం ప్రాజెక్టే : రేవంత్ రెడ్డి

Revanth Reddy On Medigadda Barrage Issue : కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఈరోజు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్లకు కక్కుర్తి పడి కేసీఆర్ బలి చేశారని.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను బలి చేసేది ఈ ప్రాజెక్టేనని రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth Reddy On Medigadda Barrage Issue
Revanth Reddy

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2023, 3:06 PM IST

Updated : Nov 2, 2023, 4:14 PM IST

ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను బలి తీసుకునేది కాళేశ్వరం ప్రాజెక్టే రేవంత్ రెడ్డి

Revanth Reddy On Medigadda Barrage Issue : కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ కుంగిదన్న వార్తలతో విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు తమ ఎన్నికల ఆయుధంగా మలుచుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యాంటీ కాళేశ్వరంఅంశాన్నే ప్రచార అస్త్రంగా మలుచుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని.. ఈ ప్రాజెక్టు కేసీఆర్ ఏటీఎం అని రాహుల్ విమర్శించారు.

Revanth Reddy On Kaleshwaram Project :ఇక ఇప్పుడు ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుతో కేసీఆర్ పాపం పండిందని, కేసీఆర్ అవినీతి కుండ పగిలిందని అన్నారు. గుడిని.. గుడిలో లింగాన్ని దిగమింగిన కేసీఆర్‌ను ఇక ఎవరూ కాపాడలేరని అన్నారు. ఇంత పెద్ద తప్పు చేసిన కేసీఆర్‌ను తెలంగాణ సమాజం తప్పక శిక్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అసలు స్వరూపం తెలుసుకున్న ప్రజలు ఈ ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

కాళేశ్వరానికి అసలేమైంది, మొన్న మేడిగడ్డ, నేడు అన్నారం బ్యారేజీ దిగువన రెండు చోట్ల బుంగలు

"లక్ష కోట్ల ప్రజాధనం గోదావరిలో పోసిన పన్నీరైనా కూడా.. బీఆర్‌ఎస్ అవినీతిని బీజేపీ కాపాడుతోంది. బీఆర్‌ఎస్, బీజేపీ అవినీతికి ప్రాజెక్టు బలైంది. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ బలి తీసుకుంటే.. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు బలి తీసుకుంటుంది. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఓడిపోతారని బీఆరెస్‌కు స్పష్టత వచ్చింది. అందుకే కేసీఆర్ కేంద్రం సహకారంతో కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు చేయిస్తున్నారి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించి తీరుతాం."- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

Revanth Reddy Visited Medigadda Barrage :రాహుల్ గాంధీతో కలిసి ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదని-- కాళేశ్వరం కర్రెప్షన్ రావు అనే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని విమర్శించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయని ఆరోపించారు.

Medigadda Barrage Issue : మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు.. రాష్ట్రానికి కేంద్రం అల్టిమేటం

25వ పిల్లర్ నుంచి 1వ పిల్లర్ వరకు పూర్తిగా కుంగిపోయిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పిల్లర్స్ రెండున్నర అడుగులు మేరకు కుంగిపోయినట్లు అధికారులే స్వయంగా చెబుతున్నారని పేర్కొన్నారు. మేడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. మిగతా సగం ప్రాజెక్టు పరిస్థితి కూడా సాంకేతిక నిపుణులచే పరిశీలిస్తే తప్ప ఏంటనేది స్పష్టం కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్మాణం చేసిన ఎల్ అండ్ టీ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతో పాటు, సంబంధిత ఇంజినీర్లు, సీడీఓపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

"చిన్న విషయానికే ట్విటర్​లో స్పందించే కేసీఆర్​ కుటుంబం.. మేడిగడ్డ విషయంలో ఎందుకు స్పందించదు?"

Last Updated : Nov 2, 2023, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details