తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth Reddy.. మునుగోడు పాదయాత్రకు రేవంత్‌రెడ్డి దూరం - hyderabad latest news

రేవంత్‌రెడ్డి
రేవంత్‌రెడ్డి

By

Published : Aug 13, 2022, 1:09 PM IST

Updated : Aug 13, 2022, 2:06 PM IST

13:07 August 13

Revanth Reddy.. మునుగోడు పాదయాత్రకు రేవంత్‌రెడ్డి దూరం

Revanth Reddy: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలోని నారాయణపురం నుంచి చౌటుప్పల్‌ వరకు కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్రకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్వరంతో బాధపడుతుండడం, కరోనా లక్షణాలు ఉండటంతో నమానాలను కొవిడ్ నిర్ధారణ పరీక్షకు పంపించారు. కాగా, మరోవైపు మునుగోడు పాదయాత్రకు రేవంత్‌ రాకూడదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

ఈ మేరకు పాదయాద్రకు వెళ్లకుండా రేవంత్‌ని ఆపాలని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌ను కోమటిరెడ్డి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఏఐసీసీ ప్రతినిధులు బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కోమటిరెడ్డి పట్టు వీడడం లేదని పార్టీ వర్గాల సమాచారం.

ఇవీ చదవండి:తెరాస పాలనలో డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం: బండి సంజయ్

ప్రగతి పథంలో ప్రజా రథం.. 75 ఏళ్ల అభివృద్ధి యజ్ఞం

Last Updated : Aug 13, 2022, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details