Revanthreddy meets Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం బండ్ల గణేశ్ నివాసానికి వెళ్లిన రేవంత్ దాదాపు 2గంటలపాటు ఆయనతో చర్చించారు. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్న గణేశ్‌ను .. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని పీసీసీ అధ్యక్షుడు కోరినట్టు తెలుస్తోంది.
బండ్ల గణేశ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ... 2 గంటలపాటు వాటిపైనే చర్చ!! - సినీ నిర్మాత బండ్ల గణేశ్
Revanthreddy meets Bandla Ganesh: ఇవాళ సాయంత్రం బండ్ల గణేశ్‌తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 2 గంటలపాటు బండ్ల గణేశ్‌తో రేవంత్ చర్చించారు.
బండ్ల గణేశ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ
ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు బండ్ల గణేశ్ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆసక్తి చూపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో డీలాపడ్డారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు రాజకీయాలకు సంబంధించిన అంశాలపై ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు కానీ, ఎక్కడా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో బండ్ల గణేశ్ ను యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
ఇవీ చూడండి..