Revanth reddy comments on success of Bharat Jodo Yatra: ప్రజల సహకారంతోనే రాష్ట్రంలో జోడో యాత్ర ఇంతగా విజయవంతమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు పరిష్కరించలేని సమస్యలకు రాహుల్ గాంధీ ఒక పరిష్కారమార్గంగా కనిపిస్తున్నారని రేవంత్ తెలిపారు. దేశంలో ఇటువంటి యాత్రలు కొన్ని మాత్రమే జరిగాయని.. జోడో యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు.
'భారత్ జోడో యాత్ర దేశ చరిత్రలో నిలిచిపోతుంది'
Revanth reddy comments on success of Bharat Jodo Yatra: ప్రభుత్వాలు పరిష్కరించలేని సమస్యలకు రాహుల్‌గాంధీ యాత్ర ఒక పరిష్కార మార్గంగా కనిపిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశంలో ఇటువంటి యాత్రలు కొన్ని మాత్రమే జరిగాయని.. ఇది చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
మహత్మాగాంధీ, సర్దార్ వల్లభాయి పటేల్, జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్రం కోసం కొట్లాడిన వీరందరూ కూడా ఆరోజు తీవ్రమైన సమస్యల గురించి పోరాడారు. ఆరోజు సమస్యాత్మక మార్పులు ద్వారా నాయకులుగా ఎన్నికయ్యారు. ఈ 8ఏళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రశేఖర్, అమిత్‌షా ఒక దుర్మార్గమైన పాలనను తీసుకొచ్చారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు అసలు స్ఫూర్తే లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఒక లీడర్‌గా మారారు. దేశానికి దశాదిశా నిర్దేశించగల, బలమైన నాయకుడు.. అధికారం కోసం వెళ్లని, లాభాపేక్షలేని నాయకుడు రాహుల్‌గాంధీ. - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: