తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్​ను అమలు చేయాలి'.. కేసీఆర్​కు రేవంత్​ లేఖ - రేవంత్​రెడ్డి లేఖ

Revanth Reddy letter to CM KCR: ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయనుకుంటే.. ఎనిమిదేళ్ల తెరాస పాలనలో నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. నోటిఫికేషన్ల పేరిట ఊరించటమే తప్ప ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయలేదని మండిపడ్డారు. ఉద్యోగాలు, రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసిన రేవంత్‌రెడ్డి.. పోలీస్‌ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు పాటించలేదని ఆరోపించారు.

Revanth Reddy letter to CM KCR
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి

By

Published : Nov 9, 2022, 2:14 PM IST

Revanth Reddy letter to CM KCR: రాష్ట్రంలోని ఉద్యోగాలు, రిజర్వేషన్ల అంశంపై సీఎం కేసీఆర్​కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయనుకుంటే నిరాశే మిగిలిందని ఆ లేఖలో రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. నోటిఫికేషన్ల పేరిట ఊరించడమే తప్ప ఉద్యోగాలు భర్తీ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. 8 ఏళ్ల తెరాస పాలనలో నిరుద్యోగులకు నిరాశే మిగిలింది తప్ప న్యాయం జరగలేదని ఆయన వాపోయారు.

రాష్ట్రంలోని నిరుద్యోగ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్​​ వర్తించదా అని ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసు నియామకాల్లో ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు పాటించలేదని రేవంత్​ తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రకారం చూసినా అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉద్యోగాల ప్రక్రియలో ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్​ను అనుసరించకపోవడం వల్ల దాదాపు 15వేల మంది అభ్యర్థులు నష్టపోతున్నారని అన్నారు. ఎస్​ఐ, కానిస్టేబుల్​ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్​ కోటాను నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details