శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదం పూర్తిగా మానవ నిర్లక్ష్యంగానే జరిగిందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. క్షేత్ర సిబ్బంది రెండు రోజుల క్రితమే హెచ్చరించినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఇందుకు మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావులు బాధ్యత వహించాలన్నారు. వారిద్దరిపై చర్యలకు ముఖ్యమంత్రిని ఆదేశించాలని కోరుతూ ఆయన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాశారు.
గవర్నర్‌కు రేవంత్ లేఖ.. 'శ్రీశైలం విషయంలో జోక్యం చేసుకోండి' - fire accident
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. శ్రీశైలం అగ్నిప్రమాద ఘటనకు మానవ నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. సిబ్బంది రెండ్రోజుల క్రితమే హెచ్చరించినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావులపై చర్యలకు సీఎం కేసీఆర్‌ను ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు.
బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాల్సిందిగా సీఎంను ఆదేశించాలన్నారు. అలాగే ఈ ఘటనపై సీబీఐ విచారణను కోరాలని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. కొవిడ్ విషయంలో జోక్యం చేసుకున్నట్లుగానే శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాద ఘటన విషయంలోనూ జోక్యం చేసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు.
ఇవీ చూడండి: శ్రీశైలం అగ్నిప్రమాదస్థలికి వెళ్తుండగా రేవంత్ అరెస్ట్