తెలంగాణ

telangana

ETV Bharat / state

డీజీపీకి రేవంత్‌రెడ్డి లేఖ.. ఆ 12 మంది ఎమ్మెల్యేల గురించే..!

Revanth Reddy letter to DGP Anjani Kumar: రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి డీజీపీకి ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

Pcc
Pcc

By

Published : Feb 9, 2023, 5:27 PM IST

Revanth Reddy letter to DGP Anjani Kumar: కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ జరపాలని కోరుతూ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలతో ఏడు పేజీల లేఖను రాష్ట్ర డీజీపీకి నివేదించారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ పార్టీ నుంచి అక్రమంగా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలపై గతంలో కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

ఆరో తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ 12 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మరొకసారి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఆర్థిక, రాజకీయ ప్రలోభాలు చేపట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 నుంచి 2018 వరకు నలుగురు ఎంపీలు 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలను వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ మీద చేర్చుకున్నట్లు వివరించారు.

2018 ఎన్నికల తర్వాత మరొకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నట్టుగా తెలిపారు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన నమోదు చేసిన కేసులో నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి వాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. ఆ ముగ్గురుతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలను విచారించాలని.. విజ్ఞప్తి చేశారు. ఈ ఎమ్మెల్యేల కేసులు సీబీఐ విచారణ చేపట్టిన దృష్ట్యా మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులు కూడా సీబీఐ వారికి పంపాలని కోరారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details