Revanth Reddy letter to CM KCR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC President Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల(Contract Junior Lecturers) వేతనాల చెల్లింపు విషయంలో ప్రభుత్వ వైఖరిని గురించి లేఖలో రేవంత్ ప్రస్తావించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ కాంట్రాక్ట్ ఉద్యోగులు, జూనియర్ లెక్చరర్లు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవని.. అంతా సర్కార్ ఉద్యోగులే ఉంటారని ఎద్దేవా చేశారు.
Revanth Reddy Demand to Pay Salaries to Contract Junior Lecturers :సమైక్య పాలకులు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను చాలా బాధలు పెట్టారన్నారు. ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరినీ రెగ్యులర్ చేస్తా అని తెలంగాణ ఉద్యమ సమయంలోబీఆర్ఎస్ సర్కార్ చాలాసార్లు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అంతేకాకుండా 2014 టీఆర్ఎస్(బీఆర్ఎస్) మెనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారన్నారు. ఆశించినట్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ, కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల కష్టాలు మాత్రం తీరలేదని ఆరోపించారు.
Contract Junior Lecturers Salary Problems : క్రమబద్ధీకరణ జరగకపోగా.. 'జీతాలివ్వండి మహాప్రభో' అని అర్ధించాల్సిన పరిస్థితి రాష్ట్ర పాలనలో దాపురించిందని విమర్శించారు. మే నెలలో రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఏప్రిల్ నెల జీతం ఇంకా రాలేదని ఆరోపించారు. డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు కొన్ని జిల్లాల్లో జీతాలు పెండింగ్లోనే ఉన్నాయన్నారు. విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నా.. సకాలంలో నెలలుగా జీతాలు లేక వందలాది మంది అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు.
Revanth Reddy Demanded to Pay Salary of Junior Lecturers :నెలల తరబడి జీతాలు రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారి, ఈఎంఐలు సకాలంలో కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వారంతా అప్పలపాలవుతున్నారని మండిపడ్డారు. వాటిని సకాలంలో చెల్లించలేక మానసిక క్షోభను అనుభవిస్తున్నారని తెలిపారు.