Revanth Reddy Latest Comments: నిరుద్యోగ సమస్యపై ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై అధికార పార్టీకి చెందిన వారు దాడులు చేయడాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. గాంధీభవన్‌లో పార్టీ సభ్యత్వ ప్రక్రియపై పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన యువజన కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడాన్ని ఆయన ఖండించారు.
Revanth Reddy Latest Comments: 'ఎమ్మెల్యేలకు వినతి పత్రాలిస్తే దాడులు చేస్తారా?' - Gandhi bhavan news
Revanth Reddy Latest Comments: హైదరాబాద్ గాంధీభవన్‌లో పార్టీ సభ్యత్వ ప్రక్రియపై పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులను ఆయన ఖండించారు.
ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్‌లు విడుదల చేయలేదని... నిరుద్యోగ భృతి ఇంతవరకు ఇవ్వలేదని రేవంత్ ఆరోపించారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్‌పై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ముట్టడిలో భాగంగా జడ్చర్లలో పోలీసులు అతి ఉత్సాహం చూపడంతో యువజన కాంగ్రెస్ కార్యకర్త శ్రీనివాస్ నాయక్ కాలు విరిగిందని విమర్శించారు. పోలీసులు శాంతిభద్రతలు కాపాడకుండా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయడం దారుణమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.