'హాథ్ సే హాథ్ జోడో యాత్ర'తో పెరిగిన కాంగ్రెస్ జోష్.. ఒక్కొక్కరుగా కదం కదుపుతున్న నేతలు Revanth Reddy fires on BRS in Padayatra: వరుస పరాజయాలు, నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌లో ఇటీవల ప్రారంభించిన 'హాథ్ సే హాథ్ జోడో యాత్ర' నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి "యాత్ర ఫర్ చేంజ్'' పేరుతో నియోజకవర్గాల వారీగా పాదయాత్రలు చేస్తున్నారు.
Revanth Reddy Comments on BRS: ఈ నెల 6న చేపట్టిన ఈ పాదయాత్ర ఇప్పటి వరకు 12 అసెంబ్లీ నియోకవర్గాలల్లో 14 రోజుల పాటు దాదాపు 150 కిలోమీటర్లు మేర కొనసాగింది. రేవంత్ పాదయాత్రకు పార్టీ శ్రేణుల నుంచి విశేష స్పందన వస్తుండటం.. కాంగ్రెస్ వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. యాత్రలో భాగంగా మార్గమధ్యలో రైతులు, కూలీలు, మహిళలు, వికలాంగులు, విద్యార్థులను కలుస్తున్న రేవంత్‌రెడ్డి... వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
Revanth Reddy Comments on CM KCR: ఓ వైపు సీఎం కేసీఆర్ పాలనాతీరును ఎండగడుతున్న రేవంత్‌రెడ్డి... నియోజకవర్గాల్లో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల వైఫల్యాలపై ఛార్జీషీట్ల విడుదల, కఠిన పదజాలంతో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో పెరుగుతున్న ధరలు, రైతులకు గిట్టుబాట ధర, విద్య, వైద్యం ఇలా ఆ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల గురించి ప్రశ్నిస్తూ, ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకునేందుకు యాత్రను వేదికగా చేసుకుంటున్నారు.
రేవంత్ చేస్తున్న ఆరోపణలపై ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు స్పందించక తప్పని పరిస్థితి నెలకొంటుండటంతో పరస్పర విమర్శలు రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ధరణి పోర్టల్ రద్దు, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం, ఏడాదిలోనే రూ.2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు, రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబంధు కింద రూ.15 వేలు సాయం, రూ.500లకే వంటగ్యాస్ లాంటి హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నెల 26 వరకు పాదయాత్రకు విరామం: ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, ఆలోగా ఒక దఫా ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలన్నింటిని పాదయాత్రగా పీసీసీ అధ్యక్షుడు పర్యటించేందుకు ప్రణాళికలు రూపొందించారు. యాత్రలో భాగంగా విరామ సమయాలల్లో స్థానిక నాయకులతో సమావేశమై.. పార్టీ స్థితిగతులపై ఆరాతీయటం, దిశానిర్దేశం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్లీనరీ కారణంగా ఈ నెల 26 వరకు పాదయాత్రకు విరామం ప్రకటించిన రేవంత్‌రెడ్డి... సోమవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరికొందరు తమ ప్రాంతాల్లో పాదయాత్రలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇవీ చదవండి: