Revanth reddy on MLC Kavitha : పాలమూరు రంగారెడ్డి తప్ప టీఆర్ఎస్కు ఏ ప్రాజెక్టుతో సంబంధం లేదని.. అవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న ఆయన.. కొడంగల్ అభివృద్ధికి నిధుల కోసం ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని డిమాండ్ చేశారు.
'కవితను, బీఎల్ సంతోశ్‌ను ఎందుకు అరెస్టు చేయట్లేదు..?' - బీజేపీ ప్రభుత్వంపై రేవంత్ విమర్శనాస్త్రాలు
Revanth reddy on MLC Kavitha: కేంద్రం ఎమ్మెల్సీ కవితను, రాష్ట్రం బీఎల్ సంతోశ్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకే టీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కొడంగల్‌ను దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్.. ఈ నాలుగేళ్ల కాలంలో అక్కడ ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోబంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారు.. నాలుగేళ్ల కాలంలో కొడంగల్‌లో ఏం అభివృద్ధి చేశారో కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కొడంగల్ అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రకటన జరగాలన్న రేవంత్‌రెడ్డి.. లేకపోతే గ్రామగ్రామాన తిరిగి టీఆర్ఎస్ తీరుని ఎండగడతామని హెచ్చరించారు. గాంధీ కుటుంబమే విచారణ సంస్థలను గౌరవించిందన్న రేవంత్.. టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారన్న ఆయన... కేంద్రం కవితను, రాష్ట్రం బీఎల్ సంతోశ్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకే టీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
ఇవీ చదవండి: