తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth Reddy Fires on PM Modi : 'ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వలేదు'

Revanth Reddy Fires on PM Modi : ప్రధాని నరేంద్రమోదీ పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ప్రకటిస్తారని ఆశించినట్లు రేవంత్​రెడ్డి అన్నారు. పసుపు బోర్డును ఏదో కొత్తగా ఇస్తున్నట్లు ప్రకటించారని రేవంత్​ ఆరోపించారు. పాలమూరుకు ప్రధాని ఏవైనా ప్రకటిస్తారు అని అనుకున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వలేదని విమర్శించారు.

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2023, 1:05 PM IST

Updated : Oct 2, 2023, 2:05 PM IST

Revanth Reddy Fires on PM Modi
Revanth Reddy

Revanth Reddy Fires on PM Modi ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వలేదు

Revanth Reddy Fires on PM Modi : తెలంగాణలోప్రధాని నరేంద్రమోదీ పర్యటన రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి(Revanth Reddy) అన్నారు. పాలమూరుకు ప్రధాని ఏవైనా పథకాలు/కార్యక్రమాలు ప్రకటిస్తారని ఆశపడ్డామని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల(Palamuru Lift Scheme)కు జాతీయ హోదా ప్రకటిస్తారని ఆశించినట్లు తెలిపారు.

Revanth Reddy Reaction on PM Modi Palamuru Speech :పాలమూరుకు కనీసం ఒక భారీ పరిశ్రమనైనా ప్రకటిస్తారని అనుకున్నట్లు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. పసుపు బోర్డును ఏదో కొత్తగా ఇస్తున్నట్లు ప్రకటించారని ఆయన ఎద్దేవా చేశారు. బయ్యారం ఉక్కుపై ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) ప్రకటన చేస్తారని అనుకున్నామని తెలిపారు. యూపీఏ(UPA) హయాంలో తీసుకున్న నిర్ణయాలను సైతం ప్రధాని అమలు చేయలేదని విమర్శించారు. పాలమూరు ప్రజలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని రేవంత్​రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ సభకు బీజేపీ అగ్ర నాయకులు రాకపోవడంపై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మోదీ సభకు దూరంగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి(Rajagopal Reddy), విజయశాంతి, వివేక్, సోయం బాపురావు రాలేదని అన్నారు. ప్రధానికి తెలంగాణ పట్ల అక్కసు ప్రదర్శించారు.. కాబట్టే తెలంగాణవాదులుగా రాజగోపాల్​రెడ్డి, విజయశాంతి, వివేక్ తదితరులు మోదీ పర్యటనను బాయ్​ కాట్ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ పట్ల ప్రధాని మోదీ వివక్షత చూపిస్తున్నారని విమర్శించారు.

Turmeric Board in Telangana 2023 : మళ్లీ తెరపైకి పసుపు బోర్టు .. ఈసారైనా రైతుల కల నెరవేరుతుందా..?

Revanth Reddy Comments on PM Modi Tour : నరేంద్రమోదీ(PM Modi) కేవలం గుజరాత్​కి మాత్రమే ప్రధానమంత్రా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణపై అక్కసు పెంచుకున్న మోదీని.. తెలంగాణకు తేవడం ప్రజలను అవమాన పరచడమేనని రేవంత్​ మండిపడ్డారు. వాళ్లకు వాళ్లు భజన చేసుకోవడానికే బీజేపీ సభ పెట్టుకున్నారని మండిపడ్డారు. మోదీ వచ్చి వరాలు ఇస్తాడని ఆశిస్తే.. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై మోదీ ప్రకటన చేశారని తెలిపారు. గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు(Turmeric Board) కొత్త అంశాలు కావని రేవంత్​ విమర్శించారు.

Revanth Reddy on CM KCR :కుటుంబ పాలన గురించి మాట్లాడిన మోదీ.. కుటుంబ దోపిడీ గురించి మాట్లాడలేదని అన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంటి..? అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి చేస్తున్నారని అంటారని.. కానీ చర్యలు మాత్రం ఎందుకు తీసుకోరని నిలదీశారు. కేసీఆర్ దోపిడీలో మోదీకి వాటా ఉందని.. డిపాజిట్లు కూడా రాని రాష్ట్రానికి మోదీ పదేపదే రావడం ఏంటని ధ్వజమెత్తారు. మోదీ పర్యటనలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే అని రేవంత్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Revanth Reddy Fires on BRS Government :ఏం చేసినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ(BRS Party)ని నమ్మరని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మోకాళ్లతో నడిచినా హరీశ్​రావు, కేటీఆర్​ని ప్రజలు నమ్మరని అన్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుందనే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ, ఫీజు రియింబర్స్​మెంట్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, మైనార్టీ రిజర్వేషన్లు అనే 6 గ్యారెంటీ(Congress 6 Guarantees) పథకాలను కాంగ్రెస్ గతంలో అమలు చేసిందని గుర్తుచేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ అమలు చేసిన పథకాలు వేరే రాష్ట్రంలో అమలు పరచలేదని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు.

PM Modi Tweet on Turmeric Board Telangana : 'పసుపు రైతుల కోసం మేం ఎంతవరకైనా వెళ్తాం.. ఏమైనా చేస్తాం'

BRS Leaders Fires on PM Modi : 'తెలంగాణకు ప్రధాని మోదీ కొత్తగా ఇచ్చిందేంటి..?'

Last Updated : Oct 2, 2023, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details