రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు అలమటిస్తుంటే...కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ విమర్శించింది. దిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేవలం వ్యక్తిగత పనులకే పరిమితమయ్యారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఆరోపించారు. ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టాన్ని కేంద్రానికి నివేదించడంలోనూ నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అఖిలపక్ష ఎంపీలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు.
ప్రధానిని ప్రశ్నించడానికి సీఎం ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇతర పార్టీల వెనక ఉండి పోరాడుతున్నట్లు మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో వర్షాలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయట్లేదని మండిపడ్డారు.