నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కొట్లాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే.. ఆ మూడింటిని కేసీఆర్ దారాదత్తం చేశారని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. నీళ్లను జగన్ మోహన్ రెడ్డికి, నిధులు ఆంధ్రప్రాంత కాంట్రాక్టర్లకు, నియామకాలు కేసీఆర్ కుటుంబానికి ఇచ్చేసుకున్నారే కానీ తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు.
పోతిరెడ్డిపాడు నీటి తరలింపు సామర్థ్యం పెంచితే విద్యుత్ ప్రాజెక్టులు చచ్చిపోతాయని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అపరమేధావైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ మాత్రం ఆలోచన తట్టలేదా అని నిలదీశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రాజెక్టుల వద్ద నిరసన చేయనున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కార్యాచరణను ప్రకటిస్తారన్నారు.