Revanth Reddy Fires on KCR and KTR: అకాల వర్షం కారణంగా తెలంగాణలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందొచ్చిన పంట మొత్తం నీటిపాలైంది. ఈ విషయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే..అయ్య ఔరంగాబాద్‌లో.. కొడుకు ప్లీనరీల పేరుతో..రాజకీయ సభలు పెట్టుకుని ఊరేగుతున్నారని ఘాటు విమర్శలు గుప్పించారు. 'వీళ్లకు ఏమైనా మానవత్వం ఉందా..బాధ్యత ఉందా.. ఇది ప్రభుత్వమేనా?' అని ప్రశ్నించారు. రైతు - యువత ఏకమై బీఆర్ఎస్ను బొందపెట్టే సమయం త్వరలోనే వస్తుందని చెప్పుకొచ్చారు.
Revanth Reddy on Crop Damage in Telangana :రాష్ట్రంలో పలు జిల్లాలో మంగళవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. ఈ అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. కల్లాల్లో, మార్కెట్లో, రోడ్లపై ఆరబోసిన ధాన్యం అంతా నీటిపాలైంది. భారీగా కురిసిన వర్షానికి రాత్రి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన పంటను చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొన్నిచోట్ల ధాన్యపు కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొట్టుకుపోయాయి. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం కారణంగా చేలలోని పంటలు అధికమొత్తంలో పాడైపోయాయి.