Revanth Reddy Pays Tribute To Rajiv Gandhi : వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ది చెప్పి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి(Rajiv Gandhi Jayanthi) సందర్భంగా సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. రేవంత్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్‌రావు ఠాక్రే, అంజన్ కుమార్, వి.హనుమంతరావు, జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Rajiv Gandhi birth anniversary celebrations in Hyderabad : బీజేపీ, బీఆర్ఎస్ నాణానికి బొమ్మ-బొరుసు లాంటివని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శలు చేశారు. వారిద్దరిదీ ఫెవికాల్ బంధమన్నారు. దేశ సంపదను మోదీ తన మిత్రులకు దోచి పెడుతుంటే.. కేసీఆర్ రాష్ట్ర సంపదను తన కుటుంబ సభ్యులకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి ప్రజలు.. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. మణిపుర్ మండుతున్నా.. ప్రధాని అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Telangana Congress Party Released Campaign Poster : 'తిరగబడదాం- తరిమికొడదాం' నినాదంతో కాంగ్రెస్
Revanth Reddy Remember Services Of Rajiv Gandhi : ఈ సందర్భంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు, అభివృద్ధిని రేవంత్ రెడ్డి, ముఖ్య నేతలు గుర్తు చేసుకున్నారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసి.. మహిళలకు రిజర్వేషన్లు కల్పించిది కూడా ఆయనే అని కొనియాడారు. సాంకేతిక విప్లవానికి తెర దీసింది.. అందుకు తగ్గ అడుగులు వేసింది రాజీవ్ గాంధీనే అని అన్నారు. సెల్‌ఫోన్‌తో మరో విప్లవానికి నాంది పలికి.. నేడు అందరి చేతిలో ఫోన్ ఉన్నదంటే కారణం ఆయనే అని తెలిపారు.